నూతన సంవత్సరం అనగానే అందరికీ జనవరి 1 గుర్తొస్తుంది. అది ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ మాత్రమే. కానీ.. మన హిందూ సంప్రదాయం ప్రకారం.. తెలుగు వారికి ఉగాది పండుగ రోజే కొత్త సంవత్సరం మొదలవుతుంది. గత తెలుగు సంవత్సరాది శుభకృత్ నామ సంవత్సరం మార్చి 21న ముగియడంతో.. మార్చి 22 నుండి కొత్తగా శ్రీ 'శోభకృత్' నామ సంవత్సరాది ప్రారంభం అవుతుంది.