ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను భారీగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా మనబడి నాడు-నేడు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేశారు. తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కొన్ని ప్రాంతాల్లో పనులే ముందుకు కదలడం లేదు. వారం రోజుల వ్యవధిలో రెండుచోట్ల స్కూళ్ల పైకప్పు పెచ్చులూడిపడటంతో నాడునేడు పనులపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. కర్నూల్ జిల్లా సి.బెళగల్ […]