ఇప్పటికా సరైన చికిత్స లేని కరోనాను అరికట్టాలంటే అనేక దేశాలు టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్) అనే విధానాన్నే అమలు చేస్తున్నాయి. కరోనా ఎంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుందో తెలిసిన విషయమే. కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ వారి శరీరంలో కరోనా వైరస్ ఉంటుంది. ఇటువంటి వారు వారికి తెలియకుండానే వ్యాధిని వ్యాపింపజేస్తారు. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు కరోనాను గుర్తించేందుకు కొత్త ప్రక్రియలను తీసుకొస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్స్, షాపింగ్ మాల్స్‌లో టెంపరేచర్ చెక్ చేస్తున్న విషయం […]