అయ్యప్ప స్వామి పుట్టుకను కించపరుస్తూ భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో అయ్యప్ప స్వాములు బైరి నరేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి సైతం పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బైరి నరేష్‌ను అరెస్ట్ కూడా చేశారు. ఈ వ్యవహారం సద్దుమణుగుతున్న సందర్భంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి సరస్వతి అమ్మవారిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ పాత వీడియో […]