ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సపన్ సెంగుప్త కన్నుమూశారు. గతకొద్ది నెలలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల వయసులో శనివారం కన్నుమూశారు. ముంబై, పావాయ్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సపన్ సెంగుప్త మరణవార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెంగుప్త మరణంపై ఆయన కూతురు శిల్పి ఘోష్ మాట్లాడుతూ.. ‘‘ నాన్న ఢాకాలో జన్మించారు. కోల్కతాలో పెరిగారు. 1957 టైంలో ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్న కలతో బాంబేకు వెళ్లారు. అక్కడే నాన్నకు జగ్మోహన్తో పరిచయం […]