ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పేరు చెప్పగానే ఒకప్పుడు స్లెడ్జింగ్ మాత్రమే గుర్తొచ్చేది. గ్రౌండ్ లో అలా చెలరేగిపోయేవారు. కానీ గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మ్యాచ్ లో గెలుపోటములు తప్పించి మిగిలిన వాటి గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఐపీఎల్ పుణ్యమా అని ఆటగాళ్ల మధ్య సంతోషకర వాతావరణం ఏర్పడింది. ఇక డేవిడ్ వార్నర్ గురించి ఎంత చెప్పుకొన్నా సరే తక్కువే. పేరుకే ఆసీస్ క్రికెటర్ గానీ.. మనలో ఒకడిలా కలిసిపోయాడు. […]