పంజాబ్ లోని జలంధర్ లోని మాలియన్ గ్రామంలో దారుణం జరిగింది. కొంత కాలంగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్.. స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో కబడ్డీ కప్ జరుగుతున్న సమయంలో సందీప్ సింగ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతని తల, ఛాతిపై దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. సందీప్ కేవలం పంజాబ్‌లోనే కాకుండా కెనడా, యుఎస్‌ఎ, యుకేలలో […]