తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. దేశరాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టేందుకు ఇక కొంత సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 5 దసరా రోజున జాతీయ పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించారు. అయితే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడాన్ని పలు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు స్వాగతించారు. అలా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం కేసీఆర్ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూ ఒడిశా లోని పూరీ […]