తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. దేశరాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టేందుకు ఇక కొంత సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 5 దసరా రోజున జాతీయ పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించారు. అయితే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడాన్ని పలు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు స్వాగతించారు. అలా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం కేసీఆర్ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూ ఒడిశా లోని పూరీ తీరంలో కేసీఆర్ సైకత శిల్పం వెలిసింది. దేశ్ కి నేత.. కిసాన్ కా భరోసా.. కేసీఆర్ అంటూ ఆ కేసీఆర్ సైకత శిల్పం రాశారు. టీఆర్ఎస్ నేత అలిశెట్టి అర్వింద్ ఆధ్వర్యంలో సైకత శిల్పి సాహు దీనిని రూపొందించారు.
ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీఎం కేసీఆర్.. ఇక దేశా రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ కొత్త పార్టీ ఏర్పాటు. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి రావడాన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు స్వాగతించారు. అలానే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. తమ నాయకుడు సీఎం కేసీఆర్ 14 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శిగా తీర్చిదిద్దారని. అదే తరహాలో దేశ భవిష్యత్ మార్చగల సామర్ధ్యం ఆయనకే ఉందంటూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నమ్మకం వ్యక్తం చేశారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూ టీఆర్ఎస్ నేత అలిశెట్టి అర్వింద్ ఆధ్వర్వంలో కేసీఆర్ సైకత శిల్పాని రూపొందించారు. ఒడిశా రాష్ట్రంలోని పూరీ తీరంలో “దేశ్ కి నేత.. కిసాన్ కా భరోసా.. కేసీఆర్” అంటూ సైకత శిల్పం వెలిసింది. దీనిని సైకత శిల్పి సాహు రూపొందించారు.
యావత్ భారత దేశం తెలంగాణ వైపు చూస్తున్న వేళ.. దేశ గతిని మార్చేందుకు నడుం బిగించిన తమ నాయుకుడు కేసీఆర్ కి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకు ఇలా సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు అర్వింద్ తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా.. దేశ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి.. అక్కడనే అన్న చందాన ఉందని అర్విద్ అన్నారు. రైతులు, ఇతర వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులతో అల్లాడుతున్నారంటే కారణం కాంగ్రెస్, బీజేపీ పార్టీల పాలన వైఫల్యమేనని, అందుకే కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారని అర్వింద్ పేర్కొన్నారు. పూరీ తీరంలో రూపొందించిన కేసీఆర్ సైకత శిల్పాన్ని చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి కనబరిచారని అర్వింద్ తెలిపారు. ఇలా ఎందరో టీఆర్ఎస్ అభిమానులు గులాబి దళపతి కేసీఆర్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
CM KCR SAND ART AT PURI BEACH pic.twitter.com/iUUNzc4qbU
— IamWithKCR (@IamWithKCR) October 4, 2022