తెలంగాణాకు తలమానికంలా నిలిచే మేడారం జాతర ఫిబ్రవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర కొనసాగుతుంది. తాజాగా వన దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఓబుళాపూర్లో జరుగుతున్న సమ్మక – సారలమ్మ జాతరను కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్బంగా వన దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా జాతరకు వచ్చిన భక్తులను కేటీఆర్ పలకరించారు. […]
సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర.ఈ వనదేవతల జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతుంటారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘ మాసంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు కులమతాలకు అతీతంగా భక్తజనం తరలివస్తారు. తెలంగాణవ్యాప్తంగా ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి తరలివస్తుంటారు. కాగా, ఈ మహాజాతర విశిష్టతను […]