ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న, కోట్లాది మందిని కటిక పేదరికంలోకి నెట్టేస్తున్న అత్యంత తీవ్రమైన మహమ్మారి కరోనా అని ఆర్థికవేత్తలు అంగీకరిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.2 శాతం కుదించుకుపోతుందని గత 150 ఏళ్లలో ఎన్నడూ చూడనంతగా పతనమవుతుందని ప్రపంచ బ్యాంకు జోస్యం చెప్పింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు దశాబ్దాలు శ్రమించి సాధించిన పురోగతిని కరోనావైరస్ కాలరాస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవ్యవస్థలను మాంద్యంలోకి పడదోస్తోంది.కరోనా సంక్షోభం అనేక […]