కాకినాడ- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో బైక్ పై వెళ్తున్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవ్వడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండదని, ప్రాణానికేమి ప్రమాదం లేదని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇక శుక్రవారం రాత్రి సాయి ధరమ్ […]