హైదరాబాద్- ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్ది యాక్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, నిద్ర మత్తు వంటి కారణాలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా చాలా ప్రాంతాల్లో కార్లు కాలువల్లోకి, చెరువుల్లోకి దూసుకెళ్లడం చూస్తున్నాం. హైదరాబాద్ లోను ఇలాంటి ప్రమాదమే ఒకటి జరిగింది. హైదరాబాద్ లో నడి బొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. […]