“చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తు పెట్టుకుంటుంది” ఆ విజేతల మాటున ఎందరో పోరాట యోథులు చరిత్రలో కనుమరుగైపోతుంటారు. వారి పేరైతే చరిత్ర మర్చిపోవచ్చేమో గానీ.. వారి పోరాటాన్ని మాత్రం అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. అలా క్రికెట్ చరిత్రలో కనుమరుగైన పోరాట యోథుడే రబింద్ర రామ్ నారాయణ్ సింగ్.. క్రీడాభిమానులందరూ ముద్దుగా రాబిన్ సింగ్.. అని పిలుచుకుంటారు. సచిన్, గంగూలీ, కపిల్ దేవ్ లాంటి.. ఆటగాళ్ల మానియాలో, రాబిన్ సింగ్ అద్భుతమైన ఎన్నో ఇన్నింగ్స్ లు చరిత్రలో కలిసిపోయాయి. […]