SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Team India Cricketer Robin Singh Life Story

Robin Singh: దేశం మర్చిపోయిన ఓ గొప్ప క్రికెటర్ కథ! ఎవరీ రాబిన్ సింగ్?

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 13 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Robin Singh: దేశం మర్చిపోయిన ఓ గొప్ప క్రికెటర్ కథ! ఎవరీ రాబిన్ సింగ్?

“చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తు పెట్టుకుంటుంది” ఆ విజేతల మాటున ఎందరో పోరాట యోథులు చరిత్రలో కనుమరుగైపోతుంటారు. వారి పేరైతే చరిత్ర మర్చిపోవచ్చేమో గానీ.. వారి పోరాటాన్ని మాత్రం అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. అలా క్రికెట్ చరిత్రలో కనుమరుగైన పోరాట యోథుడే రబింద్ర రామ్ నారాయణ్ సింగ్.. క్రీడాభిమానులందరూ ముద్దుగా రాబిన్ సింగ్.. అని పిలుచుకుంటారు. సచిన్, గంగూలీ, కపిల్ దేవ్ లాంటి.. ఆటగాళ్ల మానియాలో, రాబిన్ సింగ్ అద్భుతమైన ఎన్నో ఇన్నింగ్స్ లు చరిత్రలో కలిసిపోయాయి. మరపురాని మెరుపు లాంటి ఇన్నింగ్స్ లతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన ఘనత రాబిన్ సింగ్ సొంతం.

నైన్టీస్‌లో సచిన్‌, గంగూలీ లాంటి హేమహేమీలతో భారత్‌ బ్యాటింగ్‌ బలంగా ఉన్నా.. ఫీల్డింగ్‌లో మాత్రం మనం పసికూనలమే. కవర్స్‌లో ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి బాల్‌ వెళ్తుంటే చేయి లేపి బౌండరీ లైన్‌ ఫీల్డర్‌ను అలర్ట్‌ చేయడం అలవాటు పడ్డ టీమిండియా.. తొలిసారి పక్కకు డైవ్‌ చేస్తూ.. బాల్‌ను ఆపే ఫీల్డర్‌ను చూసింది.. అతనే రాబిన్‌ సింగ్‌. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చి బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ కొత్త ఒరవడి సృష్టించాడు. 1999 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు రాణించకపోయినా.. ఓటమి తలపుతట్టేలా ఉన్న సమయంలో బంతి అందుకున్న రాబిన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌తో అద్భుతం చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు మొత్తం 5 వికెట్లు కూల్చి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. బాల్‌తోనే కాదు.. ఆస్ట్రేలియాపై తన బ్యాటింగ్‌ పవర్‌ కూడా చూపించాడు.

team-india-cricketer-robin-singh-life-story

100 పరుగులలోపే 4 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో షేన్‌ వార్న్‌ లాంటి దిగ్గజ బౌలర్‌ను ఎదుర్కొవడమే కాకుండా.. అతని ఓవర్‌లో ఏకంగా మూడు భారీ సిక్సులు కొట్టి.. ఆస్ట్రేలియాకే షాక్‌ ఇచ్చాడు. ఇలా అనేక సందర్భాల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో టీమిండియాకు అపద్బాంధవుడిలా మారాడు. రాబిన్‌ రాక ముందు.. ఆడితే సచిన్‌ లేదంటే గంగూలీ.. బౌలింగ్‌ వేస్తే శ్రీనాథ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ లేదంటే కుంబ్లే. ఇలా ఉన్న టీమిండియాకు రాబిన్‌ సింగ్‌ ఒక ఆణిముత్యంలా దొరికాడు. జట్టు 4, 5 వికెట్లు కోల్పోయినా ప్రత్యర్థి టీమ్‌కు వణుకుపుట్టించేవాడు రాబిన్‌ సింగ్‌. మూడు విభాగాల్లోనూ అద్భుతాలు చేసిన రాబిన్‌ సింగ్‌లోని మరో స్పెషల్‌ టాలెంట్‌ ఏంటంటే.. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక విభాగంలో అద్భుత ప్రదర్శన ఇస్తాడు. జట్టులో అతనుంటే బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్‌ రూపంలో ముగ్గురు ఆటగాళ్లు జట్టులో ఉన్నట్లే.

ఇలా వన్డేల్లో అప్పటి వరకు టీమిండియా చూడని ఒక ఆటగాడిగా ఎదిగిన రాబిన్‌సింగ్‌ టెస్ట్ జట్టులో మాత్రం స్థానం సంపాదించుకోలేక.. తన టెస్ట్ కెరీర్ ను ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కు పరిమితం చేసుకున్నాడు. మెగ్రాత్, బ్రెట్ లీ, గిలెస్పీ, షేన్ వార్న్ లాంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొంటూ.. ఆస్ట్రేలియాపై 1999లో చేసిన 30 బంతుల్లో 75 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ ఓ మరపురాని సంఘటనే. ఇంతటి ఘనత వహించిన రాబిన్ కు మాత్రం రావాల్సినంత పేరు మాత్రం రాలేదనే చెప్పాలి. సచిన్, గంగూలీ, అజారుద్దీన్ లాంటి ఆటగాళ్ల మాటున రాబిన్ సింగ్ అనే పోరాట శిఖరం కనుమరుగు కాక తప్పలేదు. ఇప్పుడంటే సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సచిన్, కోహ్లీ, ధోని లాంటి ఆటగాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

team-india-cricketer-robin-singh-life-story

కానీ అప్పట్లో ఇంతలా సోషల్ మీడియా లేదు. దాంతో ఓ డాషింగ్ బ్యాట్స్ మెన్ సాధారణ ఆటగాడిగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన రిటైర్మెంట్ తర్వాత టీమిండియాకు పలు విభాగాల్లో కోచ్ గా వ్యవహరించాడు. IPLలో ముంబాయి ఇండియన్స్ కు ఫీల్డింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ గా వ్యహరించి.. ముంబాయి ఐపీఎల్ కప్ ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర వహించాడు. రాబిన్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున 136 వన్డేలు ఆడి 2336 పరుగులు చేశాడు. అలాగే 69 వికెట్లు తీసుకున్నాడు. ఇక రాబిన్ సింగ్ గురించి తెలిసిన వారు మాత్రం సచిన్, ధోని, కోహ్లీ కన్నా రాబిన్ సింగే గొప్ప ఆటగాడు అంటూ కితాబిస్తున్నారు. ఇన్ని ఘనతలు సాధించిన రాబిన్ సింగ్ చివరికి దేశం మరచిపోయిన గోప్ప ఆటగాడిగానే మిగిలిపోయాడు.

  • ఇదీ చదవండి: బాబర్‌ అజమ్‌, రిజ్వాన్‌ హాఫ్‌ సెంచరీలు! అయినా ట్రోల్‌ చేస్తున్న పాక్‌ ఫ్యాన్స్‌

Tags :

  • Cricket News
  • Indian Former Cricketer
  • life story
  • Robin Singh
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam