సినిమా ఒక మనిషిని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో అనడానికి బలగం సినిమానే ఉదాహరణ. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగా ఎమోషనల్ అవుతున్నారు. ఆప్యాయత, అనురాగం వంటి బంధాలను తెంచుకుని బతుకుతున్న మనుషులు బలగం చూసి ఒకటవుతున్నారు. అందరం కలిసి ఉంటేనే బలగం అని తెలుసుకుంటున్నారు. రీసెంట్ గా బలగం సినిమా చూసి విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు ఒకటయ్యారు. తాజాగా 45 ఏళ్ల తర్వాత ఒక కుటుంబం ఒకటైంది.
నాట్యం చేసేందుకు వయస్సుతో, మనస్సుతో సంబంధం లేదు. ఆరు నెలల చిన్నారి అయిన.. అరవై ఏళ్ల వృద్దులైన నాట్యానికి ఫిదా కాని వారు ఉండరు. అదే నిరూపించారు ఈ బామ్మలు. కృష్ణా, రామ అని మూలన కూర్చోకుండా..తమలోని టాలెండ్ ను బయటపెట్టారు.
మనం ఏదైనా వస్తువును పోగొట్టుకుంటే ఒక పది, పదిహేను రోజులు దాని గురించి వెతుకుతాం. ఆ లోపు దొరక్కపోతే దాని గురించి ఆశలు వదిలేసుకుంటాం. ఇక దొరకదని అనుకుంటాం. అయితే కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ 46 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సును తిరిగి పొందింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొలీన్ డిస్టిన్ అనే మహిళ కాలిఫోర్నియాలోని మెజిస్టిక్ వెంచురా థియేటర్‌లో పనిచేసేది. 46 ఏళ్ల క్రితం ఒక రోజు ఆమె తన […]