ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. మొన్నీమధ్యే జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యాడు. పదవి దక్కాక తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇంకేముంది.. బంధువర్గం, అనుచరగణం, కార్యకర్తలతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఎటు చూసినా కేకలు, నినాదాలతో హోరెత్తిపోయింది. ఎంతగా అంటే అంబులెన్సు సైరన్ కూడా వినపడనంతగా. ఓ అభాగ్యుడి ప్రాణం గాల్లో కలిసిపోతున్నా కూడా పట్టనంతగా. ఈ ఆరోపణలు ఎదుర్కుంటోంది మరెవరో కాదు.. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఓ వ్యక్తి మరణానికి ఎమ్మెల్యేనే […]