చెన్నై- ఎవరైనా ఎన్నికల్లో ఎన్ని సార్లు గెలిచారోని రికార్డు ఉంటుంది. ఎక్కువ సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే గోప్పగా భావిస్తాం. కానీ తమిళనాడులో ఎక్కువ సార్లు ఎన్నికల్లో ఓడిపోయి రికార్డు సృష్టించాడో వ్యక్తి. అది కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. సేలం జిల్లా మేట్టూరుకు చెందిన పద్మ రాజన్ ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి ఒక్క సారి కూడా గెలుపొందలేదు. ఆయన 1989 నుంచి దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. […]