చెన్నై- ఎవరైనా ఎన్నికల్లో ఎన్ని సార్లు గెలిచారోని రికార్డు ఉంటుంది. ఎక్కువ సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే గోప్పగా భావిస్తాం. కానీ తమిళనాడులో ఎక్కువ సార్లు ఎన్నికల్లో ఓడిపోయి రికార్డు సృష్టించాడో వ్యక్తి. అది కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. సేలం జిల్లా మేట్టూరుకు చెందిన పద్మ రాజన్ ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి ఒక్క సారి కూడా గెలుపొందలేదు. ఆయన 1989 నుంచి దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలు అసెంబ్లీ, పార్లమెంటు, రాష్ట్రపతి ఎన్నికల వరకు ఓటమి గురించి ఆలోచించకుండా పోటీచేస్తూ వస్తున్నాడప రాజన్. ఇలా అత్యధిక ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా లిమ్కా, గిన్నిస్ తదితర రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నాడు.
అందువల్ల ఆయనను స్థానికంగా ఎన్నికల కింగ్ అని పిలుస్తారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఎడప్పాడి నియోజకవర్గంలో, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా ధర్మధం నియోజకవర్గంలోనూ, తన సొంత నియోజకవర్గం మేట్టూరులో కూడా పోటీచేశాడు పద్మ రాజన్. 1989 నుంచి ఇప్పటివరకూ ఆయన 218 సార్లు నామినేషన్ వేసి అన్ని ఎన్నికల్లో ఓడిపోయారు. మరి ఇది కూడా ఓ రికార్డే కదా అంటాడు రాజన్.