మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం దాదాపు ఉండకపోవచ్చు. భక్తికి, దాస్యభక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం . పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మా! సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచని సీతమ్మతల్లి రామచంద్రునికి మేలు జరుగుతుందని […]