సైదాబాద్ చిన్నారిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడి రాజు ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిని మానవ మృగం రాజు అత్యాచారానికి పాల్పడి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 9 నుంచి పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు అత్యాచారం, హత్య చేసిన తర్వాత పోలీసు కన్నుగప్పి తిరుగుతున్న నేపథ్యంలో అతన్ని […]