వరంగల్- హైదరాబాద్ లోని సింగరేని కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన తరువాత సుమారు వారం రోజుల నుంచి తప్పించుకు తిరిగిన రాజు, అనూహ్యంగా రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ముఖం ఛిద్రం కావడంతో చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి చనిపోయింది […]