హైదరాబాదులో మెట్రో రైలు ప్రారంభమైన తొలి రోజు నుంచే విపరీతమైన ప్రజాదరణ పొందింది. రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దాంతో తొలి సంవత్సరాలలో మంచి లాభాలనే సాధించింది. అయితే కరోనా రాకతో మెట్రో లాభాలు పట్టాలు తప్పాయి. మెట్రో వేళలు పెంచినా రద్దీ పెరగడం లేదు. లాక్‌డౌన్ అనంతరం గ్రేటర్ పరిధిలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో మెట్రో వేళలను పెంచారు. కానీ నగరవాసులు మాత్రం మెట్రోను అంతగా ఆదరించడంలేదు. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో లక్ష […]