భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ జట్టుకి మెంటార్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్ మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఎంతో మంది మాజీలు విమర్శలు గుప్పించారు. దీంతో గంభీర్ తనని అవమానించారంటూ కొంతమందిపై పరువు నష్టం వేసాడు.