భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ జట్టుకి మెంటార్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీతో గొడవ కారణంగా గంభీర్ మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఎంతో మంది మాజీలు విమర్శలు గుప్పించారు. దీంతో గంభీర్ తనని అవమానించారంటూ కొంతమందిపై పరువు నష్టం వేసాడు.
భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ జట్టుకి మెంటార్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ ఐపీఎల్ లో గంభీర్ చాలా అగ్రెస్సివ్ గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో గొడవ ఈ మాజీ ఓపెనర్ స్థాయిని కాస్త కిందకి దిగజార్చించింది. ఆ టైంలో చాలా మంది గంభీర్ మీద చాలా విమర్శలే వచ్చాయి. భారత జట్టుకి రెండు వరల్డ్ కప్ లు అందించిన గంభీర్ ఇలా చిన్న పిల్లాడిలా ప్రవర్తించడం ఏ ఒక్కరికీ నచ్చలేదు. తప్పు ఎవరిదని విషయం పక్కన పెడితే ఒక సీనియర్ గా గంభీర్ దూకుడుగా వ్యవహరించడం కాదని మాజీలు కాస్త గట్టిగానే బుద్ధి చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా.. దీంతో గంభీర్ తనని అవమానించారంటూ కొంతమందిపై పరువు నష్టం వేసాడు.
గంభీర్ మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఎంతో మంది మాజీలు విమర్శలు గుప్పించారు. ప్రేక్షకులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే అది ఇక్కడితో ఆగలేదు. ఏకంగా ఇండియా మొత్తం విస్తరించేలా ఒక న్యూస్ పేపర్ గంభీర్ ని అవమానించింది. హిందీ న్యూస్ పేపర్ అయినటువంటి “పంజాబీ కేసరి” గంభీర్ ని భస్మాసుర అని పిలుస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. భస్మాసురుడు అంటే ఎవ్వరిని గెలవనీయకుండా అందరినీ తొక్కేసేవాడని అర్ధం. దీంతో గంభీర్ తనకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోయారు.
పంజాబ్ కేసరి న్యూస్ పేపర్ ఎడిటర్ అయినటువంటి ఆదిత్య చోప్రా, కరస్పాండెంట్ అమిత్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు వేసాడు. వీరందరూ పత్రికా స్వేచ్చని మిస్ యూజ్ చేసుకుంటున్నారని వారి మీద 2 కోట్ల పరువు నష్టం దావా వేసాడు.ఇలా తనపై తప్పుడుగా ఆర్టికల్స్ రాసే న్యూస్ పేపర్లందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దేంతో అడ్వకేట్ జై దేహద్రాణి కేస్ ఫైల్ చేసాడు. మరి ఈ విషయంలో గంభీర్ ఎంత దూరం వేళ్తాడో చూడాలి. మొత్తానికి గంభీర్ తనకి అన్యాయం గురించి ఏకంగా కోర్టులో కేసు వేయడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.