మోసగాళ్లు పెరిగిపోతున్నారు. కొత్త తరహా మోసాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నగరంలో తిమింగళం వాంతి పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తిమిగలం వాంతిని అంబెర్ గ్రిస్ అని పిలుస్తారు. ఇది ఒక విలువైన పదార్థం. దీన్ని బ్యూటీ ఉత్పత్తులు, పర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారు. మేలైన అంబెర్ గ్రిస్ కు వేడి తగిలితే వెంటనే కరిగిపోతుంది. చల్లార్చిన తరువాత మళ్లీ గట్టిపడుతుంది. అంబెర్ గ్రిస్ ను తేలియాడే బంగారం లేదా సముద్రపు నిధి అంటారు. […]