బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి చెంది తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది భారత జట్టు. చెత్త బ్యాటింగ్ కు తోడు చెత్త ఫీల్డింగ్ తోడు కావడంతో బంగ్లాదేశ్ కు విజయాన్ని చేజేతులా కట్టబెట్టింది. ఫీల్డర్లు క్యాచ్ లు జారవిడచటంతో పాటుగా ఓవర్ త్రోలతో అనవసరంగా పరుగులు సమర్పించుకున్నారు. దాంతో బంగ్లా విజయం మరింత సులువైంది. […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు.. ఇరు జట్ల కెప్టెన్ లు ప్రెస్ మీట్ నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ప్రెస్ మీట్ లో సారథులు జట్టులో ఏమైనా మర్పులు ఉంటే తెలియజేస్తారు. ఇక తమ వ్యూహాల గురించి చెప్పి ప్రత్యర్థికి భయం తెప్పించాలని చూస్తారు. ఈ క్రమంలో రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇస్తారు. ఇక ఆదివారం టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్-పాక్ మధ్య జరగబోతోంది. […]