వైద్య సేవల కోసం వచ్చిన రోగులకు ప్రిస్కిప్షన్‌పై మందులు రాసే విషయంలో వైద్యులకు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి కీలక ఆదేశాలను జారీ చేసింది. జనరిక్ మెడిసిన్ పేర్లనే ప్రిస్కిప్షన్‌లలో రాయాలని సూచించింది. ఔషధాల బ్రాండ్ నేమ్ మాత్రం రాయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మెడిసిన్ బ్రాండెడ్ పేర్లకు బదులుగా వాటిలోని కాంపౌండ్ మెడిసిన్‌లనే పేర్కొనాలంటూ గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వైద్య మండలి గుర్తుచేసింది. మందుల చీటీల్లో బ్రాండ్ నేమ్ పేర్కొనరాదని ఇటీవల భారతీయ వైద్య […]