Crime News: జార్ఖండ్‌లో వంద కోట్ల రూపాయల మైనింగ్ స్కాంకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. బుధవారం 20 చోట్ల సోదాలు నిర్వహించింది. జార్ఖండ్‌తోపాటు బిహార్, తమిళనాడు, ఢిల్లీలలోని 20 ప్రదేశాల్లో సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలోనే స్కాంలో హస్తం ఉందని భావిస్తున్న ప్రేమ్ ప్రకాశ్ అనే మధ్యవర్తి ఇంటిని రైడ్ చేసింది. రైడ్ సందర్బంగా ఇంట్లో రెండు ఏకే 47 రైఫిళ్లు కనిపించాయి. బీరువాలో జాగ్రత్తగా దాచిన వాటిని ఈడీ అధికారులు గుర్తించారు. […]