ప్రముఖ గజల్ రచయిత్రి బైరి ఇందిర ఇకలేరు. చిన్నతనం నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకున్న ఆమె.. సుమారు 600లకు పైగా గజల్స్ రాశారు. క్యాన్సర్ తో పోరాడుతున్నా ఆమె చివరి వరకు తన ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. చావు తనకు తప్పదని భావించిన తాను గజల్స్ రాయడం మానలేదు.
బూర రాజేశ్వరి అనేకంటే సిరిసిల్ల రాజేశ్వరి టక్కున గుర్తుకొస్తుంది అందరికీ. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఒక నిరుపేద చేనేత కార్మిక కుటుంబానికి చెందిన బూర అనసూయ, సాంబయ్య దంపతులకు 1980లో ఆమె జన్మించింది. ఆమె పుట్టుకతోనే వికలాంగురాలు. చేతులు వంకర్లుపోయి పని చేయవు. మాటలు రావు. తల నిలబడదు. ఎప్పుడూ వణికిపోతుంటుంది. చేతులు సరిగా పని చేయకపోవడంతో పట్టుదలతో కాళ్లతోనే రాయడం నేర్చుకొని స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. సిరిసిల్ల అంటే […]