యూట్యూబర్ గా మంచి ఫేమ్ సంపాదించుకొని.. బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టాడు షణ్ముఖ్ జస్వంత్. బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఇంకేమైనా ఉందా.. ఏకంగా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, సెలబ్రిటీ హోదా సొంతం చేసుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్ లు, కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు.