దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు సంప్రదాయ వ్యవసాయంపైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఆదాయ వనరులను పెంచుకుంటున్నారు. అలాంటి ఆలోచన ఉన్నవారికి ‘ముత్యాల సాగు..‘ మంచి ఐడియా అని చెప్పొచ్చు. తక్కువ స్థలంలో.. తక్కువ ఖర్చుతో లక్షల రూపాయల లాభం పొందే వ్యాపారం ఇది. సహజంగా ముత్యాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే, నత్తగుల్లలు లేదా మసెల్స్ (నల్ల నత్తలు) పెంచి వాటి ఆల్చిప్పల నుంచి ముత్యాలు తయారుచేస్తున్నారు. ఆల్చిప్ప/ముత్యపుచిప్ప లోపలి పోరల్లో జరిగే రసాయన చర్యల […]