ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2013లో పట్నాలో పర్యటించిన సందర్భంలో ఆయన ర్యాలీలో బాంబు పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసును విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం పదిని మందిని విచారించిన కోర్టు తొమ్మిది మందిని దోషులుగా నిర్ధారించగా, వారిలో నలుగురికి ఉరిశిక్ష.. ఇద్దరికి యావజ్జీవిత ఖైదు విధించారు. అలాగే మిగతా ముగ్గురిలో ఇద్దరికి పదేళ్లు, ఇంకొకరికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు […]