సెహ్వాగ్, యుసుఫ్ పఠాన్ వీరబాదుడు, హర్భజన్ సింగ్, డానియల్ వెటొరీ స్పిన్‌మాయాజాలం, కలిస్, కెవిన్ ఒబ్రెయిన్ బ్యాటింగ్ మళ్లీ చూసి క్రికెట్ ప్రేమికులు మురిసిపోయారు. కొన్నేళ్ల క్రితం ప్రపంచ క్రికెట్‌ను ఊపేసిన ఈ స్టార్ ఆటగాళ్లు మరోసారి మైదానంలో సందడి చేశారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో భాగంగా శుక్రవారం వరల్డ్ జెయింట్స్‌తో ఇండియా మాహరాజాస్ పోటీ పడ్డారు. అలనాటి స్టార్ క్రికెటర్లు మరోసారి హోరాహోరీగా తలపడ్డారు. ఈ అద్భుతమైన మ్యాచ్‌కు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. […]