సెహ్వాగ్, యుసుఫ్ పఠాన్ వీరబాదుడు, హర్భజన్ సింగ్, డానియల్ వెటొరీ స్పిన్‌మాయాజాలం, కలిస్, కెవిన్ ఒబ్రెయిన్ బ్యాటింగ్ మళ్లీ చూసి క్రికెట్ ప్రేమికులు మురిసిపోయారు. కొన్నేళ్ల క్రితం ప్రపంచ క్రికెట్‌ను ఊపేసిన ఈ స్టార్ ఆటగాళ్లు మరోసారి మైదానంలో సందడి చేశారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో భాగంగా శుక్రవారం వరల్డ్ జెయింట్స్‌తో ఇండియా మాహరాజాస్ పోటీ పడ్డారు. అలనాటి స్టార్ క్రికెటర్లు మరోసారి హోరాహోరీగా తలపడ్డారు. ఈ అద్భుతమైన మ్యాచ్‌కు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. ఈ మ్యాచ్‌లో కలిస్ కెప్టెన్సీలోని వరల్డ్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 170 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఓపెనర్ కెవిన్ ఒబ్రెయిన్ 31 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి చెలరేగగా.. రామ్‌దిన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులతో రాణించడంతో వరల్డ్ జెయింట్స్ మంచి స్కోర్ సాధించింది. కెప్టెన్ కలిస్ కేవలం 12 పరుగులే చేసి నిరాశ పరిచాడు. టీమిండియా టర్బోనేటర్ హర్భజన్‌సింగ్ కలిస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా ఇండియా మహరాజాస్ నుంచి ఏకంగా 8 మంది బౌలింగ్ వేశారు. ఇర్ఫాన్ పఠాన్ 2, శ్రీశాంత్ 3, హర్భజన్‌సింగ్ 4, జోగిందర్ శర్మ 2, దిండా 2.4, యుసుఫ్ పఠాన్ 2, మొహమ్మద్ కైఫ్ 0.2, పంకజ్‌సింగ్ 4 ఓవర్లు వేశారు. వీరిలో పంకజ్ సింగ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో పంకజ్ సింగ్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు.
ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఒక్కటంటే ఒక్క రన్ కూడా ఇవ్వకుండా.. మూడు వికెట్లు తీశాడు. మొత్తం మీద 4 ఓవర్లు వేసి 26 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక 171 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇండియా మహరాజాస్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లో ఒక ఫోర్ కొట్టిన డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ అదే ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. సెహ్వాగ్ కేవలం 4 పరుగులే చేసి అవుట్ అవ్వడంపై అభిమానులు నిరాశ చెందారు. మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్ సైతం 18 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. శ్రీవాస్తవా 39 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు చేసి రాణించాడు. మొహమ్మద్ కైఫ్ 11 రన్స్‌చేసి నిరాశ పరిచాడు.
కాగా.. పఠాన్ బ్రెదర్స్ అదరగొట్టారు. యూసుఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 50 పూర్తి చేసుకున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లోనే మూడు సిక్సులతో 20 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో ఇండియా మహరాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి గెలుపొందింది. 5 వికెట్లతో అదరగొట్టిన పంకజ్‌సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో ప్రపంచ టీమ్‌పై భారత్ విజయం సాధించడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్‌పై, పంకజ్ సింగ్ స్పెల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A triple wicket maiden for Pankaj Singh🔥🔥🔥
📸: Disney+Hotstar pic.twitter.com/30BgNTMDXi
— CricTracker (@Cricketracker) September 16, 2022
What a moment! Truly #Legendary! Pankaj Singh takes 5 wickets which brings us towards the end of first innings! #LegendsLeagueCricket #BossLogonKaGame #BossGame #LLCT20 pic.twitter.com/SDdrD9uxud
— Legends League Cricket (@llct20) September 16, 2022
The Boss of the match goes to none other than #PankajSingh for his formidable fifer. Take a bow #boss. #LegendsLeagueCricket #BossGame #BossLogonKaGame #LLCT20 pic.twitter.com/MsKZUUeiDn
— Legends League Cricket (@llct20) September 16, 2022
The #Legends with their winning trophy!
Congratulations to @IndMaharajasLLC on winning this special match. What a game!! #LegendsLeagueCricket #BossLogonKaGame #BossGame #LLCT20 pic.twitter.com/moNF9E4p80
— Legends League Cricket (@llct20) September 16, 2022
Give it up for @IndMaharajasLLC for registering a #Boss win as they chase down @WorldGiantsLLC score with 6 wickets still remaining in hand. What a legendary show! #LegendsLeagueCricket #BossLogoKaGame #BossGame #LLCT20 pic.twitter.com/PtdIEWhXqn
— Legends League Cricket (@llct20) September 16, 2022
ఇది కూడా చదవండి: వీడియో: ఇండియన్ ఉమెన్స్ టీమ్‌లో మరో దినేష్ కార్తీక్! ఈ ఒక్క షాట్ చాలు..