ఇటీవలి కాలంలో అమెరికాలోని పలు వార్తా పత్రికలు ‘‘వూహాన్ పరిశోధన శాల కుట్ర’’కోణంలో పలు వార్తలు ప్రచురించడంతో మరోసారి చర్చ మొదలైంది. వూహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ముగ్గురు 2019 నవంబర్‌లో కరోనా లక్షణాలతో చికిత్స పొందినట్లు అమెరికా నిఘా నివేదిక చెబుతున్నా ట్రంప్ ఆదేశించిన విచారణను ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ నిలిపివేశారన్న ఆరోపణలతో కథనాలు రావడం గమనార్హం. అప్పట్లో కుట్ర కోణాన్ని కొట్టిపారేసిన బైడెన్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథొనీ ఫాసీ లాంటి వారు […]
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో నాలుగు వారాల్లో కట్టడి చేసే మందు అందుబాటులోకి రానుందని చెబుతున్నారు నిపుణులు. కరోనాకు మరో సరికొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది. కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ ‘శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ ముక్కులో స్ప్రే చేసే నైట్రిక్ నాసల్ స్ప్రే (ఎన్ఓఎన్ఎస్)ను తయారుచేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందని పేర్కొంది. […]
ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం తలుపులు సోమవారం (నేటి ఉదయం) తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్‌లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కరోనా కారణంగా, భక్తులు గత సంవత్సరంలో లానే ఈసారి కూడా కేదారనాధుడిని నేరుగా చూసే అవకాశం లేదు. ఆన్‌లైన్‌లో మాత్రమే […]