ఉప ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రికి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికను కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎలాగైన ఈటెల దెబ్బకొట్టేందుకు అంది వచ్చిన అవకాశాలన్ని వాడుకుంటున్నారు సీఎం కెసిఆర్. ఇక ఈ నేపథ్యంలోనే దళిత బంధు అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ లో దళిత, బీసీ సామజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో ఈ పథకానికి అంకురార్పణ జరిగిందని ప్రతిపక్షాలు […]