కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్టార్ హోటళ్లతో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీ ప్రకటనలు జారీ చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకా వేయడం జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. కొన్ని ఆస్పత్రులు కొన్ని హోటల్స్‌తో డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. హోటల్స్‌కి వచ్చే అతిథులకు రహస్యంగా వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇది చట్ట విరుద్ధం అని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం […]