ఇటీవలి కాలంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవన శైలి, సరైన శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు.. ఎక్కువసేపు ఏసీ రూమ్స్ లో గడపడం, శరీరానికి తగినంత సూర్యరశ్మి అందకపోవడం.. ఇలాంటి వివిధ కారణాల వల్ల చాలామంది పరిమితికి మించి బరువు పెరిగిపోతున్నారు. ఈ అధిక బరువు కారణంగా అనేక రకాల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం బరువు తగ్గించుకోవాలి. […]