YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులను కుట్రదారులు జీర్ణించుకోలేకపోతున్నారని, రాళ్లు వేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం మొత్తం దోచుకో.. పంచుకో.. తినుకో అనే స్కీముతో నడిచిందని విమర్శించారు. గురువారం కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 4వ విడత నిధులను విడుదల చేశారు. […]