YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులను కుట్రదారులు జీర్ణించుకోలేకపోతున్నారని, రాళ్లు వేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం మొత్తం దోచుకో.. పంచుకో.. తినుకో అనే స్కీముతో నడిచిందని విమర్శించారు. గురువారం కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 4వ విడత నిధులను విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈ రోజు బతుకులు మారుతా ఉన్నాయి. రూపు రేఖలు మార్చే అడుగులు రాష్ట్రంలో పడుతూ ఉన్నాయి.
రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ, ఏ ప్రభుత్వంలో.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, మహిళలకు ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడుతూ ఉన్నాయని సగర్వంగా.. మీ బిడ్డగా తెలియజేస్తున్నా. ఇవాళ ఇన్ని మంచి పనులు జరుగుతా ఉన్నాయని జీర్ణించుకోలేని కుట్రదారులు కూడా చాలా మంది ఉన్నారు. మంచి జరుగుతున్నపుడు సంతోషపడే హృదయాలు కావవి. మంచి జరుగుతున్నపుడు రాళ్లు వేసే హృదయాలు అవి. అటువంటి కుళ్లు, అటువంటి కుతంత్రాలు మన కళ్ల ఎదుటే మనం చాలా చూస్తా ఉన్నాము.
కోట్ల మందికి మంచి చేయడానికి ఈ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాడు అనుకుంటే.. అప్పుడు ఆ నమ్మకం జనం మీద పెట్టుకుని పరిపాలన చేస్తారు. నేను ఇవాళ చేస్తున్నది అదే.. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని మంచి చేయటం కోసం వాడుతా ఉన్నాను. నా నమ్మకం నేను చేసిన మంచి మీద ఉంది.. నా నమ్మకం ప్రజల మీద ఉంది. కానీ, కుట్రదారులు ముఖ్యమంత్రి పదవిని తన వాళ్ల కోసం.. తన ఈనాడు కోసం.. తన ఆంధ్రజ్యోతి కోసం. తన టీవీ 5 కోసం .. తన దత్త పుత్రుడికోసం వాడారు. రాష్ట్రాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో అనే స్కీముతో నడిచిన గత పరిపాలనను గమనించండి’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి : YSR Nethanna Nestham: నేతన్నలకు అండగా సీఎం జగన్! నేతన్న ఖాతాలో 24 వేలు జమ!