ఆఫ్గనిస్థాన్ లో పరిస్థితితులు చూస్తుంటే ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందో అని ప్రపంచం మొత్తం ఆందోళనగా ఉంది. అవేం పట్టకుండా క్రికెట్ మ్యాచ్ లు ఆడాలని ఉవిళ్లూరిన పాకిస్తాన్ కు చివరికి బంగపాటే ఎదురైంది. సెప్టెంబర్ 3 నుంచి శ్రీలంకలో పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్ మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ఆఫ్గన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఆఫ్గనిస్థాన్ ని తాలిబన్లు వశం చేసుకున్న విషయం తెలిసిందే. […]