క్యాబ్ సేవల సంస్థలు ఓలా, ఉబర్ విలీనవుతున్నాయంటూ వచ్చిన వార్తలు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సంస్థలు విలీనం గురించి చర్చలు ప్రారంభించాయంటూ, ఓ ఆంగ్ల దిన పత్రిక సైతం ఒక వార్తాకథనం ప్రచురించింది. ఈ వ్యాఖ్యలను ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తీవ్రంగా ఖండించారు. ఉబర్‌తో విలీనం దిశగా చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించారు. ‘అదంతా చెత్త. మేం చాలా లాభాల్లో […]