‘ఎలక్ట్రిక్ వాహనాల వాడకం’లో ప్రపంచంలోనే తొలి పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించబోతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతి నుంచి తిరుమలకు వందలాది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తుంటాయి. ఆహ్లాదకరంగా కనిపించే తిరుమల ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువే. నిత్యం భారీగా తరలివచ్చే భక్తులు ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, సొంత వాహనాల్లో తిరుమలకు చేరుకుంటారు. రోజూ పది వేలకు పైగా వాహనాలు ఘాట్ రోడ్డుపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఆర్టీసి విషయానికి వస్తే.. […]