అనంతపురం జిల్లాను కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విడదీస్తున్న ఏపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో హిందూపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి జిల్లా కావాలని ప్రజలు ఎవరూ అడగలేదని జిల్లా కేంద్రంగా హిందూపురం అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చాలా కాలంగా అభిప్రాయం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు కూడా హిందూపురం జిల్లా కేంద్రం అవుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ […]