మీకు అందరికీ గుర్తుందా? 2021 లోకి ఎన్ని ఆశలతో అడుగు పెట్టామో? 2020లో కరోనా అనే మహమ్మారి మన మీద విరుచుకు పడింది. అప్పటి వరకు మనం చూడని కష్టం అది. దీనితో జన జీవనం స్తంభించి పోయింది. ప్రజలు ఆర్ధికంగా చితికిపోయారు. నిరాశ్రయలు అయ్యారు. ఇంత కష్టంలోనే మనం 2021లో అడుగు పెట్టాము. కష్టాలు అన్నీ పోతాయి. మళ్ళీ మామూలు జీవితాన్ని గడపొచ్చు అనే ఆశతో అందరూ నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాము. […]