వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్ విశాఖ – న్యూఢిల్లీ రైలులో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. శుక్రవారం తెల్లవారుజామున రైలులోని ఎస్6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన లోకో పైలట్ వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి అధికారులకు సమాచారమిచ్చారు. ఒక్కసారే బోగీలో మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై స్టేషన్‌లో పరుగులు తీశారు. రైలు నిలిచిపోగానే ప్రయాణీకులు తమ లగేజీలను తీసుకుని కింది దిగిపోయారు. […]