అమెరికాకు చెందిన డ్యాక్యుమెంటరీ ఫిలిమ్ దర్శకుడు జెరీమీ కార్బెల్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. ఈ వీడియో ఫుటేజ్ నిజమైందేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. గ్రహాంతరవాసుల వ్యోమనౌకలుగా భావిస్తున్న ‘ఫ్లయింగ్ సాసర్లు’ అప్పుడప్పుడూ భూమిని సందర్శించి వెళుతున్నాయా? ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. […]