ప్రభుత్వాలు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అందులోని గోరంత లోపాన్ని కూడా కొండంత చేసి చూపడం ప్రతిపక్షాలకు అలవాటు. అధికారంలో ఉన్న వారి నిర్ణయాలను విపక్షలు వ్యతిరేకించడం, విమర్శించడం సహజం. కాకుంటే అందులో ఎంత నిజమున్నది అనేదే అసలు అంశం. ప్రతిపక్షం చేసే విమర్శలతో ప్రభుత్వం అనుకున్న పని చేయకుండా ఆగదు. కానీ తాము పాలించేటప్పుడు ప్రవేశపెట్టిన కార్యక్రమాలను మరిచిపోయి వ్యవహరిస్తే నవ్వుల పాలుకావడం ఖాయం. ఏపీలో ‘మటన్ మార్ట్’పై జరుగుతున్న రచ్చలో […]