ప్రతి రాజకీయ పార్టీలోను విబేధాలు, గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో అవి శృతిమించినప్పుడు అధిష్టానం రంగంలోకి దిగి.. పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికి కొన్ని సందర్భాలలో వివాదాలు తారాస్థాయికి చేరుతాయి. కొందరు నేతలు అయితే ఏకంగా మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మీడియా […]